హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలతో స్థానిక ఎమ్మెల్యే శ్రీ సైదిరెడ్డి తో కలిసి మంత్రి శ్రీ కేటీఆర్ సమావేశాన్ని నిర్వహించారు. సిమెంట్ పరిశ్రమల్లో 70% ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికులకు కల్పించాలని యాజమాన్యాలను కోరారు. స్థానికులకు ఎక్కువగా ఉపాధి కల్పించే కంపెనీలకు నూతన పారిశ్రామిక పాలసీ కింద ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.