Minister Sri KTR inaugurated a model multi-faith funeral home at Fathullaguda. The Crematorium is developed by HMDA for Hindus, Muslims and Christians at one place in 6.5 acres, with dedicated areas for each community.
All the crematoriums have a dedicated office room, cold storage, prayer hall, toilet block, last journey vehicles and parking space. A 50 KLD Sewerage Treatment Plant, 140 KW Solar Plant are also built in the premises.
Labour Minister Sri CH Malla Reddy, MLA Sri Sudheer Reddy, MAUD Special Chief Secretary Arvind Kumar, GHMC Mayor Smt Gadwal Vijaya Laxmi, and others were present on the occasion.
మూడు మతాల ప్రజల అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆధునిక హంగులతో ఎల్బీనగర్ నియోజకవర్గం, ఫతుల్లాగూడలో నిర్మించిన వైకుంఠధామాన్ని నేడు మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. సుమారు 6.5 ఎకరాల స్థలంలో ముక్తిఘాట్ పేరిట హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికను అభివృద్ధి చేశారు. 2 ఎకరాలు ముస్లిం, మరో 2 ఎకరాలు క్రిస్టియన్, హిందూ శ్మశాన వాటికకు 2 1/2 ఎకరాలు కేటాయించారు. ప్రార్థన మందిరాలు, ప్రత్యేక స్నాన గదులు, అడుగడుగునా గ్రీనరీ, ప్రత్యేకంగా సివరేజ్ ప్లాంట్, ఇతర దేశాల్లో ఉన్న వారు తమ తమ బంధువుల దహన సంస్కారాలను ఆన్లైన్ ద్వారా తిలకించేందుకు కూడా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే శ్రీ సుధీర్ రెడ్డి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.