Global Pharmaceutical giant Bristol Myers Squibb to set up a state-of-the-art facility in Hyderabad with an investment of USD 100 Million. The proposed facility in Telangana will employ about 1,500 local youth. An MoU was signed with Telangana Government in the presence of Minister KTR.
Jayesh Ranjan, Principal Secretary of Industries & Commerce, Shakthi Nagappan, CEO, Telangana Life Sciences, Samit Hirawat, Chief Medical Officer, Global Drug Development, Bristol Myers Squibb were present at the meeting.
గ్లోబల్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ (BMS – Bristol Myers Squibb) 100 మిలియన్ డాలర్లు (సుమారు 800 కోట్లు) పెట్టుబడితో హైదరాబాద్‌లో తమ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా దాదాపు 1,500 మంది స్థానిక యువతకు ఉపాధి లభించనుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో ఈరోజు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ సమావేశంలో పరిశ్రమలు & వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈవో శక్తి నాగప్పన్, బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ గ్లోబల్ డ్రగ్ డెవలప్‌మెంట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సమిత్ హిరావత్ తదితరులు పాల్గొన్నారు.