Hyderabad, a major life-sciences hub in the world, continues to play a catalytic role in bringing stakeholders together & enabling deliberations on issues of global relevance.
Minister KTR said Telangana has been a frontrunner in identifying importance of life sciences, pharma & development of holistic healthcare. We are proud to state that Hyderabad is the only city in the country that has an ever-growing Genome Valley, a Medtech Park & an upcoming Pharma City
Telangana has set out a vision of doubling Life science – Pharma ecosystem value to $100 bn by 2030.I am confident that the state will achieve this target by 2025 itself…5 years ahead of the schedule, said KTR
Envisioning that value of Telangana’s Lifesciences ecosystem will cross $250 bn by 2030, KTR said 4 pillars will help in achieving the target
-Large scale manufacturing
-R&D and Innovation
-Building high-end, cross value chain GCCs
-Convergence of Healthcare & Tech
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 20వ బయో ఏషియా సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో తెలంగాణ సాధించిన ప్రగతి గురించి మంత్రి మాట్లాడుతూ ‘‘ 2030 నాటికి ఈ రంగపు విలువను రెట్టింపు చేసి 100 బిలియన్ డాలర్లకు తీసుకువెళ్లాలనే లక్ష్యం చేసుకున్నాము. చాలామంది ఇది మరీ ఎక్కువ లక్ష్యమనుకుంటారు. అయితే 2022లోనే మేము లైఫ్‌సైన్సెస్ రంగంలో 80 బిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకున్నామని వెల్లడించేందుకు సంతోషిస్తున్నాను. ప్రస్తుత వేగంతో వెళితేనే, 2025 నాటికి మేము 100 బిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకోగలమనే నమ్మకంతో ఉన్నాము. అంటే, షెడ్యూల్‌కు ఐదు సంవత్సరాల ముందే లక్ష్యం చేరుకోగలము. ఇది తెలంగాణలో అసాధారణ వృద్ధి వేగంకు ప్రాతినిధ్యం వహిస్తుంది. గత రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఈ రంగం 23% వృద్ధి నమోదు చేస్తుంది. అదే సమయంలో జాతీయ వృద్ధి కేవలం 14%గా మాత్రమే ఉంది’’ అని అన్నారు.
లైఫ్‌సైన్స్ రంగంలో ప్రపంచ హబ్‌గా హైదరాబాద్ అవతరించిందని చెప్పారు. హైదరాబాద్ ఫార్మాసిటీ వరల్డ్ లార్జెస్ట్ హబ్‌గా నిర్మాణం జరుగుతున్నదని తెలిపారు. లైఫ్‌సైన్సెస్ రంగం బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో అనేక చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.