దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ జెడ్పీటీసీ, మాజీ జెడ్పీటీసీ, సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మా రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.