Discussions revolved around the policy recommendations to further accelerate the innovation, indigenisation and manufacturing of medical devices in India, and how the medtech companies can leverage the ecosystem in the state to support their global development operations
The Industries Minister promised that the State will champion the cause of industry & advocate with Govt. of India to bring about the right policy changes to help industry. KTR presented the overall medtech ecosystem in Telangana along with investment opportunities in the sector
రాష్ట్రంలో మెడికల్ డివైజెస్ రంగాన్ని మరింత పరుగులు పెట్టించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ రంగంలో దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు. బయో ఏషియా-2023 సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్ ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మెడికల్ డివైజెస్ కంపెనీలకు చెందిన 20 మంది ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితులు, కంపెనీ యాజమాన్యాలు ఏమేం మార్పులు కోరుకొంటున్నాయి, భవిష్యత్తులో ఆవిష్కరణల వేగం పెరగాలంటే ఏం చేయాలి, మెడ్‌టెక్ కంపెనీలు అంతర్జాతీయ స్థాయికి చేరుకోవాలంటే రాష్ట్రంలో ఎలాంటి ఎకో సిస్టం కావాలి, ప్రభుత్వాల తరఫున ఎలాంటి సహాయం కావాలి.. వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.