Minister KTR formally inaugurated Ivanti, a Cybersecurity company in Hyderabad
IT and Industries Minister Sri KTR formally inaugurated Ivanti, a Cybersecurity company in Hyderabad. Management team of Ivanti and Principal Secretary Jayesh Ranjan graced the occasion. Speaking at the event, Minister said, We welcome Ivanti, which is among the largest Cybersecurity companies in the world, to join the list of marquee companies which have presence in Telangana.
ప్రముఖ ఐటీ, సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘ఇవాంటి’ని ఐటీ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ హైదరాబాద్‌లో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికత సాయంతో మనం నేరుగా ఉపకరణాలతో అనుసంధానం కాగలుగుతున్నా.. వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలకు సైబర్ భద్రత ఈ రోజుల్లో పెను సవాల్‌గా మారిందని పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ విధానం కోసం ఇవాంటి వంటి సంస్థలతో కలిసి పనిచేసి దేశానికే ఆదర్శమైన పాలసీని రూపొందిస్తామని అన్నారు. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించడంలో భాగంగా ఇవాంటి నిర్వహించే హ్యాకథాన్‌లో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.