IT and Industries Minister Sri KTR inaugurated Callaway Golf DigiTech Center in Hyderabad. IT Department Principal Secretary Mr. Jayesh Ranjan, Callaway Golf Sr. Vice President, Global Information Technology Mr. Sai Koorapati and others graced the occasion. Callaway is the world’s leading golf brand with an annual revenue of $ 3.2 Billion. Callaway is a premium golf equipment and active lifestyle company with a portfolio of global brands, including Callaway Golf, Odyssey, OGIO, TravisMathew and Jack Wolfskin.
హైదరాబాద్లో అమెరికాకు చెందిన కాల్వే గోల్ఫ్ డిజిటెక్ సెంటర్ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్లో కాల్అవే సంస్థ ఆఫీస్ ఏర్పాటవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో డిజిటెక్ కంపెనీలు చాలా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ఆపిల్, గూగుల్, ఉబర్, నోవార్టిస్ వంటి సంస్థలు నగరానికి వచ్చాయని చెప్పారు. ఆయా సంస్థల రెండో పెద్ద క్యాంపస్లు హైదరాబాద్లోనే ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అమెజాన్ అతిపెద్ద సెంటర్ నగరంలో ఉన్నదని చెప్పారు. కాల్అవే కూడా మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు.