Union Minister for Tourism Sri Kishan Reddy Gangapuram, along with Ministers Sri KTR, Sri Mohammad Mahmood Ali ,Sri Talasani Srinivas Yadav, Smt Sabitha Indra Reddy inaugurated the Shaikpet Flyover in Hyderabad today. MLAs Arekapudi Gandhi, Sri Maganti Gopinath Sri Muta Gopal , MLCs Sri Patnam Mahender Reddy, Smt Surabhi Vani Devi, Deputy Mayor Smt Srilatha Shoban Reddy, and Senior officials from MA&UD Department participated.The Government of Telangana constructed this six lane, two way flyover under the Strategic Road Development Program (SRDP) at a cost of Rs. 333 Crore. The flyover is 2.7 kms long and helps free flow of traffic from Rethibowli towards Gachibolwli bypassing 4 crossings.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తి అయ్యి అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా రూ.333 కోట్లతో రాయదుర్గం – టోలిచౌకి మధ్య 2.7 కిలోమీటర్ల పొడవున నిర్మించిన షేక్ పెట్ ఫ్లై ఓవర్ ను కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి, మంత్రులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ మహమూద్ అలీ, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీ మాగంటి గోపినాథ్, శ్రీ అరికెపుడి గాంధీ, శ్రీ ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు శ్రీ పట్నం మహేందర్ రెడ్డి, శ్రీమతి సురభి వాణీదేవి, డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి మరియు జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.