చేనేత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చేనేత అభివృద్ధికి ప్రభుత్వం రూ. 1270 కోట్లు కేటాయించిందని తెలిపారు. నేతన్నకు చేయూత పథకం ద్వారా కార్మికులను ఆదుకుంటామని చెప్పారు. చేనేత మిత్ర పథకం ద్వారా 50 శాతం రాయితీపై ముడిసరుకులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. 2010 నుంచి 2017 వరకు తీసుకున్న చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాలు మాఫీ చేస్తామన్నారు. కొత్తకోట చేనేత సంఘాలకు సంబంధించిన రూ. 30 లక్షల రుణాలను మాఫీ చేశామని గుర్తు చేశారు. చేనేత కార్మికులకు రూ. 2 లక్షల వ్యక్తిగత రుణాలు అందిస్తామని కేటీఆర్ చెప్పారు.