వనపర్తిలో నిర్వహించిన నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ గారు ప్రసంగిస్తూ..
ఈసారి నాగర్‌కర్నూల్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయం
కేసీఆర్ గారి ఆలోచనలు మన దేశానికే స్ఫూర్తినిస్తున్నాయి
పాలమూరు పచ్చబడుతుంటే ప్రతిపక్షాల కండ్లు ఎర్రబడుతున్నాయి
పరిపాలనా సంస్కరణల్లో భాగంగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఒకే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మూడు జిల్లాలు ఏర్పాటయ్యాయి. నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం
ఇవాళ కేసీఆర్ గారి ఆలోచనలే.. దేశానికి ఆచరణగా మారాయి. కేసీఆర్ గారు స్వయంగా రైతు అయినందువల్లే రైతు సంక్షేమ పథకాలపై ఎక్కువ దృష్టి పెట్టారని, వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఇవాళ మన రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టారన్నారు. మన రైతుబంధు పథకాన్ని పేరు మార్చి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. కేసీఆర్ గారి ఆలోచనలనే నేడు చాలామంది ముఖ్యమంత్రులు అనుసరిస్తున్నారు. 43 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం ఇది. ఏప్రిల్ నుంచి ఆసరా పెన్షన్లు రూ.2016 ఇస్తామన్నారు.
నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అనే పాట ఒకనాటి ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితిని చాటింది. ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ఉన్నాయి. రెండో హరిత విప్లవానికి తెలంగాణలో నాంది పడింది. రైతులను అప్పుల ఊబి నుంచి గట్టెక్కించేందుకు రైతుబంధు తీసుకొచ్చినం. కేసీఆర్ రైతు బిడ్డ.. మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు.
ఏదో చేస్తారని ఐదేళ్ల క్రితం భారీ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తే మోదీ చేసింది శూన్యం. పోలవరానికి జాతీయహోదా ఇచ్చిన కేంద్రం కాళేశ్వరానికి ఎందుకు ఇవ్వలేదు. భావసారుప్య పార్టీలతో కలిసి కేంద్రంలో కీలకశక్తిగా మారుతాం. మోదీ తీరు.. శుష్కప్రియాలు, శూన్య హస్తాలు అన్నట్లుగా ఉంది. ఢిల్లీ గద్దెను ఎక్కేది ఎవరో టీఆర్ఎస్ నిర్ణయించాలని కేటీఆర్ తెలిపారు.